ఓటమిపై చేతులెత్తేసిన బద్వేల్‌ టీడీపీ అభ్యర్థి!

Badvel TDP condidate Obulapuram Rajashekar likely to Quit from elections - Sakshi

సాక్షి, కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన ఓటమిని ఖరారు చేసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్‌ రాజశేఖర్‌ ....పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన బద్వేల్‌లో పరాజయం తప్పదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్‌ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్‌గా నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. చదవండి...(భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి )

దీంతో తన ఓటమి ఖాయమని నిర్థారించుకున్న రాజశేఖర్‌ నిన్న తన కుటుంబసభ్యులతో సమావేశం అయ్యారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే అంశంపై చర్చించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే టికెట్‌ కోసం తాను ఇచ్చిన రూ.3 కోట్లు తిరిగి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. కాగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం బద్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సమయంలో రాజశేఖర్‌ ఉదంతం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.

టీడీపీలో అవమానించారు
వైయస్సార్ జిల్లా బద్వేల్ టీడీపీ నాయకురాలు విజయజ్యోతి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీడీపీలో ఉన్నంత కాలము తనను చిత్ర హింసలకు గురిచేశారని, అవమానించారని వాపోయారు. టీడీపీ మోసం చేయడంతో ఆ పార్టీని వదిలిపెట్టినట్టు చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారు.

చదవండి...(టీడీపీలో చల్లారని అసమ్మతి)


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top