ఎన్నారై భవనానికి స్థలం కేటాయించండి..! | NRIs asks building place in hyderabad | Sakshi
Sakshi News home page

ఎన్నారై భవనానికి స్థలం కేటాయించండి..!

Dec 11 2017 9:49 AM | Updated on Jul 6 2019 12:42 PM

NRIs asks building place in hyderabad - Sakshi

సిడ్నీ: ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన తమ ప్రతినిధుల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు సంతోష్ గుప్తాని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వివిధ ఎన్నారై సభ్యులను తెలంగాణ హాంమంత్రి నాయని నర్సింహారెడ్డి కలిశారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై భవనం నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయిస్తే వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు అందరు కలిసి ఎన్నారై భవనం నిర్మించుకుంటామని అన్నారు. తెలుగు ఎన్నారైల  కోసం భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు వారు వివరించారు. తెలంగాణలో కూడా ఎన్నారై భవనం వస్తే పలు లాభాలుంటాయని, భారతదేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నారై భవనం హైదరాబాద్‌లో నిర్మాణం కోసం స్థలం కేటాయింపు కొరకు తాను సీఎం కేసీఆర్‌తో చర్చించి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. తెలంగాణలో ఎన్నారైలు సుఖంగా తమ వ్యాపారాలు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న పలు ఎన్నారై సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. తెలంగాణ సాధనలో ఆ పార్టీ నేతల కృషిని వారు అభినందించారు. తెలంగాణలో అసలైన అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ ద్వారానే జరుగుతుందనీ, 2019 లో అన్ని వర్గాలు కారు గుర్తుకే ఓటు వేస్తారని తెలంగాణ హోంశాఖా మంత్రి నాయని నర్సింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధి కొరకై ఎన్నారైలు కీలక పాత్ర వహించాలని నాయని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా సభ్యులు నల్లా ప్రవీణ్ రెడ్డి, కపిల్ కాట్పెల్లీ ప్రశాంత్ కడపర్తి, అశోక్ మారం సందీప్ మునగాల, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్ సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటే, డేవిడ్ రాజు, శశి మానేం, వినోద్ ఏలేటి తదితరులు నాయనితో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నారై భవనం కోసం ఎయిర్ పోర్టుకు దగ్గర్లో స్థలం కేటాయిస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement