జనాభా నియంత్రణపై సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

జనాభా నియంత్రణపై బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Jan 24 2019 10:04 AM

Yoga Guru Ramdev On Population Control - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారి ఓటింగ్‌ హక్కును వెనక్కితీసుకోవాలని ఆథ్యాత్మిక గురువు బాబా రాందేవ్‌ కోరారు. వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని సూచించారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారిని ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రుల్లో ప్రవేశం కల్పించరాదని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరాదని రాందేవ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

అలీఘర్‌లో దుస్తుల షోరూం పతంజలి పరిధాన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులైనా, ముస్లింలైనా జనాభా నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు. బాబా రాందేవ్‌ గతంలోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న వివాహితుల ఓటు హక్కు రద్దు చేయాలని, తనలాంటి బ్రహ్మచారులకు ప్రత్యేక హోదా ఇచ్చి గుర్తింపు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
Advertisement