రోడ్డుపై తెలుపు, పసుపు లేన్లు ఎందుకో తెలుసా? | Why Do Some Roads Have White Markings While Others Have Yellow Ones? Here’s The Reason | Sakshi
Sakshi News home page

రోడ్డుపై తెలుపు, పసుపు లేన్లు ఎందుకో తెలుసా?

Jul 6 2016 2:17 PM | Updated on Aug 30 2018 4:49 PM

పరాయి దేశాల సంగతేమోగానీ.. భారత దేశంలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే సంఘటనలు కోకొల్లలే..

పరాయి దేశాల సంగతేమోగానీ.. భారత దేశంలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే సంఘటనలు కోకొల్లలే.. ఇలా చేయకపోవడానికి గల కారణం లెక్కలేనితనం ఒకటి కాగా ట్రాఫిక్ నిబంధనలు తెలియకపోవడం మరో ప్రధాన విషయం. ట్రాఫిక్ కూడళ్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లైట్లు ఎందుకుంటాయో అనే విషయం సాధారణంగా తెలిసిందే. అయితే, రోడ్లపై అక్కడక్కడ పొడవైన తెల్లగీతలు, రోడ్డు మధ్యలో పసుపు గీతలు, మధ్యమధ్యలో ఖండించిన తెలుపు, పసుపు గీతలు మనకు దర్శనం ఇస్తుంటాయి. వీటి గురించి అసలు ఎంతమందికి తెలుసు? వాటి అర్థం ఏమిటో ఒకసారి పరిశీలిస్తే..

పొడవైన తెల్లగీత: ఇది మీరు ఏ మార్గంలో ప్రయాణం ప్రారంభించారో అదే మార్గంలో కచ్చితంగా వెళ్లాలని సూచిస్తుంది.


మధ్యలో ఖండించిన తెలుపు లేన్లు: ఈ తరహా లేన్లు మీ మార్గాన్ని అప్పుడప్పుడ మార్చుకునేందుకు అనుమతిస్తాయి. కానీ, వెనుక, ముందు ఉన్న వాహనాలకు హెచ్చరికలు చేసి ఆ పని చేయాలి.


రోడ్డు మధ్యలో పొడవైన పసుపు రేఖ: సాధారణంగా రోడ్డుపై వాహనాలను క్రాస్ చేస్తూ వెళ్లడం మాములే. అయితే.. ఈ పసుపు లైన్ మాత్రం ఎట్టి పరిస్థితిల్లో క్రాస్ చేయకూడదు. అయితే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిబంధన ఈ సింబల్కు పెట్టుకుంటారు. తెలంగాణలో అయితే, ఈ సింబల్ క్రాస్ చేయకూడదని నిబంధన ఉంది.


రోడ్డు మధ్యలో డబుల్ పసుపు లేన్లు: ఈ లేన్లు దాటి వెళ్లే ప్రయత్నం చేయకూడదు.


ఖండించిన పసుపు లేన్: ఈ లేన్ ఉంటే వాహనాలకు హెచ్చరిక చేస్తూ పాసింగ్ చేయొచ్చు.

ఖండించని.. ఖండించిన పసుపు లేన్లు ఉంటే..: మీరు ఖండించిన పసుపు లేన్ ఉంటే వాటిని క్రాస్ చేసి డ్రైవింగ్ చేయొచ్చు. అదే ఖండించని లేన్ వైపు ఉంటే మాత్రం అలాగే కొనసాగాలి. క్రాసింగ్కు అనుమతించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement