రాజ్యసభలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం చర్చ జరగనుంది.
న్యూఢిల్లీ : రాజ్యసభలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై మరో ముగ్గురు ఎంపీలు మాట్లాడనున్నారు. వారి ప్రసంగం అనంతరం కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. అనంతరం ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. రాజ్యసభ ఛైర్మన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా నిన్న రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ వాడీవేడీగా కొనసాగిన విషయం తెలిసిందే. సభ వాయిదా పడటంతో ఇవాళ చర్చ కొనసాగనుంది.