ఎంపీ కోసం స్పెషల్ రైలు.. వివాదాస్పదం! | Special Train Organised For BJP Lawmaker Poonam Mahajan: Reports | Sakshi
Sakshi News home page

ఎంపీ కోసం స్పెషల్ రైలు.. వివాదాస్పదం!

Jun 2 2016 9:42 PM | Updated on Mar 29 2019 8:30 PM

మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కోసం భారత రైల్వే స్పెషల్ గా మహారాష్ట్ర లోని బినా నుంచి భోపాల్ కు రైలును నడపడం వివాదాస్పదంగా మారింది

భోపాల్:  మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కోసం భారత రైల్వే స్పెషల్ గా మహారాష్ట్ర లోని బినా నుంచి భోపాల్ కు  రైలును నడపడం వివాదాస్పదంగా మారింది.  భోపాల్ కు చేరుకొని అక్కడి  నుంచి పూనమ్‌ ముంబైకి ఫ్లైటులో  వెళ్లాల్సి ఉంది. ముంబైలో రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా కార్యక్రమానికి ఆమె హాజరు కావాల్సి ఉంది.

అయితే ఆమె బినాకు చేరుకునే లోపే భోపాల్ కు వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం ప్రత్యేక రైలును నడిపారు. ప్రత్యేక రైలులో భోపాల్ చేరుకున్న పూనమ్ అక్కడి నుంచి విమానంలో ముంబైకి చేరుకున్నారు. షెడ్యూల్లో లేని రైలు వల్ల పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement