‘ ఆరు నెలల్లోగా ముగించండి’ 

SC Directs CBI, ED To Complete Probe within Six Months - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2జీ స్పెక్ర్టమ్‌ కేటాయింపుల కేసులు, ఇతర సంబంధిత కేసుల విచారణను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను ఆదేశించింది. 2జీ కేసు సహా ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందం వంటి సంబంధిత కేసుల విచారణ పురోగతిని వివరిస్తూ రెండువారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హాలతో కూడిన సుప్రీం బెంచ్‌ కేంద్రాన్ని ఆదేశించింది.

2జీ స్పెక్ట్రమ్‌ వంటి సునిశిత కేసుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతూ ప్రజలకు ఆయా అంశాలపై సమాచారం వెళ్లకపోవడం సరైంది కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. 2014లో 2జీ స్పెక్ర్టమ్‌ కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన సీనియర్‌ అడ్వకేట్‌ ఆనంద్‌ గ్రోవర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. గ్రోవర్‌ స్ధానంలో ఈ కేసుకు సంబంధించి స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నియామకంపై ప్రభుత్వం ప్రతిపాదనకు కోర్టు ఆమోదం తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top