నీరవ్‌ మోదీపై మరో చార్జ్‌షీట్‌ దాఖలు

Nirav Modi Threatened To Kill Company Director Says CBI - Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పై శనివారం క్రిమినల్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మహారాష్ట్ర స్పెషల్‌ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్భాయ్ లాడ్ ను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ తెలిపింది. 'కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఆశిష్ లాడ్ కూడా ఉన్నారు.

కాగా ఈ కేసులో ఆశిష్‌ లాడ్‌ అరెస్టవ్వకుండా ఉండేందుకు  దుబాయ్‌ ద్వారా కైరో వెళ్లి తలదాచుకున్నాడు. జూన్‌ 2018లో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నఆశిష్‌ లాడ్‌ను తన సోదరుడు నేహాల్‌ మోదీ ద్వారా నీరవ్‌ మోదీ ఫోన్‌లో నువ్వు తిరిగి ఇండియాకు వెళితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని' సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. నీరవ్‌మోదీ మాట్లాడక ముందు అతని సోదరుడు నేహాల్‌ మోదీ ఆశిష్‌కు యూరోపియన్‌ కోర్టులో జడ్జి ముందు నీరవ్‌ మోదీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ రూ. 20 లక్షలు ఆఫర్‌ చేశారు. అయితే దీనిని ఆశిష్‌ లాడ్‌ తిరస్కరించడంతో నిన్ను చంపేస్తామంటూ  నీరవ్‌ మోదీ బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది.

కాగా ఈ కేసులో అరెస్టవ్వకుండా ఉండేందుకు నీరవ్‌మోదీ విదేశాలకు పారిపోయాడు. దీంతో నీరవ్‌మోదీని తిరిగి రావాలంటూ భారతదేశానికి చెందిన పలు దర్యాప్తు సంస్థలు, కోర్టులు సమన్లు జారీ చేసిన తిరిగి రాకపోవడంతో అతనిపై ఫ్యజిటివ్‌ ఎకనమిక్‌ అపెండర్‌ చట్టం కింద పలాయన ఆర్థిక నేరస్తుడిగా పేర్కొంది.  నీరవ్ మోదీ ప్రస్తుతం నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతని మామ మెహుల్ చోక్సీతో కలిసి బ్యాంకుకు రూ .13,570 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నీరవ్ మోదీను ఈ ఏడాది మార్చిలో స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top