‘కోటా కోసం ఆత్మహత్యలు వద్దు’

High Court Urges Marathas Do Not Commit Suicides - Sakshi

సాక్షి, ముంబై : మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాంబే హైకోర్టు మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ అంశం న్యాయస్ధానాల పరిధిలో ఉన్నందున సంయమనం పాటించాలని సూచించింది. మరాఠాలు కోటా కోరుతూ హింసకు దిగడం కానీ, ఆత్మహత్యలకు పాల్పడటం కానీ చేయరాదని తాము కోరుతున్నామని జస్టిస్‌ రంజిత్‌ మోరే, జస్టిస్‌ అనుజా ప్రభుదేశాయ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ కోరింది.

బీసీ కమిషన్‌ మరాఠాలకు కోటాపై ఇప్పటివరకూ చేపట్టిన కసరత్తును వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన క్రమంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కమిషన్‌ ఏర్పాటు చేసిన ఐదు ఏజెన్సీలు క్రోడీకరించిన సమాచారం, అథ్యయనాలను కమిషన్‌ నియమించిన నిపుణుల కమిటీ క్రోడీకరిస్తోందని సెప్టెంబర్‌ 5లోగా కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సీనియర్‌ న్యాయవాది రవి కదం, ప్రభుత్వ న్యాయవాది అభినందన్‌ వాగ్యాని కోర్టుకు తెలిపారు.

ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కమిషన్‌ నవంబర్‌ మాసాంతానికి తన తుది నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని చెప్పారు. కమిషన్‌ తన కసరత్తును త్వరితగతిన చేపట్టేలా చూడాలని బెంచ్‌ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top