రంజాన్ సందర్భంగా లక్నోలోని అతి పెద్ద ప్రార్ధనాస్థలం ఈద్గాలోకి ముస్లిం మహిళలను అనుమతించనున్నారు.
రంజాన్ సందర్భంగా లక్నోలోని అతి పెద్ద ప్రార్ధనాస్థలం ఈద్గాలోకి ముస్లిం మహిళలను అనుమతించనున్నారు. మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై చర్చ జరుగుతున్న నేపధ్యంలో మహిళలలకు ఈద్గాలోకి అనుమతించడం విశేషం. మసీదుల్లోకి అనుమతించకూడదనే నియయం ఖరాన్‌లో లేదనే విషయాన్ని గుర్తించానని ఈద్గా ఇమామ్ మౌలానా ఖాలిద్ రషీద్ ఫారంగీ మహ్లి తెలిపారు. అందుకే ఈద్గాలోకి మహిళలను అనుమతించామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని మౌలానా చెప్పారు.