జై శ్రీరామ్‌ అన్న బిహార్‌ ముస్లిం మంత్రి | Sakshi
Sakshi News home page

జై శ్రీరామ్‌ అన్న బిహార్‌ ముస్లిం మంత్రి

Published Mon, Jul 31 2017 1:03 AM

జై శ్రీరామ్‌ అన్న బిహార్‌ ముస్లిం మంత్రి

పట్నా: నితీశ్‌ కుమార్‌ మంత్రివర్గంలో మైనార్టీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఖుర్షిద్‌ అలియాస్‌ ఫిరోజ్‌ అహ్మద్‌ జైశ్రీరామ్‌ అని నినదించటం వివాదానికి దారితీసింది. జూలై 28న అసెంబ్లీలో నితీశ్‌ విశ్వాస పరీక్ష నెగ్గాక∙ఖుర్షిద్‌ ఈ నినాదాలు చేశారు. ‘నేను రామ్, రహీమ్‌లిద్దరినీ ఆరాధిస్తాను. బిహారీలకు మేలు జరుగుతుందంటే జై శ్రీరామ్‌ అని నినదించేదుకు నేను సంకోచించను’ అని  పేర్కొన్నారు

. చేతికి కట్టుకున్న హిందువుల పవిత్రమైన దారాన్నీ ప్రదర్శించారు. దీనిపై ముస్లిం మతపెద్దలు, విపక్షాల్లోని ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ముస్లిం సమాజాన్ని అవమానించారని.. అతను ఇస్లాంలో ఉండేందుకు అనర్హుడని ముస్లిం మతపెద్దలు మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం ఖుర్షీద్‌ ఎంతకైనా దిగజారతారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement