తొలి రోజు కలెక్షన్ 4 లక్షలు! | 203 fined on first day, 4 lakhs collected | Sakshi
Sakshi News home page

తొలి రోజు కలెక్షన్ 4 లక్షలు!

Jan 2 2016 9:37 AM | Updated on Sep 3 2017 2:58 PM

తొలి రోజు కలెక్షన్ 4 లక్షలు!

తొలి రోజు కలెక్షన్ 4 లక్షలు!

దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చేపట్టిన సరి-బేసి కార్ల ప్రయోగంలో తొలిరోజు 203 మంది ఉల్లంఘనులకు జరిమానా విధించారు. వాళ్ల నుంచి రూ. 4.06 లక్షల జరిమానా వసూలు చేశారు.

దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చేపట్టిన సరి-బేసి కార్ల ప్రయోగంలో తొలిరోజు 203 మంది ఉల్లంఘనులకు జరిమానా విధించారు. వాళ్ల నుంచి రూ. 4.06 లక్షల జరిమానా వసూలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నిబంధన ఉండగా, మొదటి అరగంటకే ఉల్లంఘన మొదలైంది. 8.33 సమయంలో ఐటీఓ జంక్షన్ వద్ద ఒక వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆపి.. జరిమానా విధించారు. పరీ చౌక్‌లోని తన ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి మరే ఇతర రవాణా సదుపాయం లేదని, అందుకే తప్పనిసరిగా కారు తీశానని సదరు ప్రయాణికుడు చెప్పాడు. 138 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకోగా, మరో 65 మందిని ఢిల్లీ రవాణాశాఖ అధికారులు పట్టుకున్నారు.

ఆటోవాలాలకూ జరిమానా
సరి-బేసి కార్ల ప్రయోగం సమయంలో ప్రయాణికులను మీటర్ చార్జీ మీద ఎక్కించుకోడానికి నిరాకరించిన 76 మంది ఆటోడ్రైవర్లకు కూడా జరిమానాలు పడ్డాయి. సరిసంఖ్య ఉన్న కార్లను ఇళ్లవద్దే వదిలిపెట్టాల్సి రావడంతో కొంతమంది ఆటోల్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇదే చాన్సని ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న ఆటోవాలాలకు అధికారులు ఫైన్ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement