కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం | What It Means, and How It Was Made | Sakshi
Sakshi News home page

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Apr 30 2018 1:44 AM | Updated on Apr 30 2018 1:44 AM

What It Means, and How It Was Made  - Sakshi

‘2001ఏ స్పేస్‌ ఒడిసీ’.. స్టాన్లీ కుబ్రిక్స్‌ ప్రపంచానికి అందించిన అద్భుతం అని చెప్పవచ్చు. సినిమా రిలీజ్‌ అయి 50 సంవత్సరాలవుతున్నా ఇంకా సినిమాటిక్‌ హై ఇస్తూనే ఉంది. సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్స్‌లో బెస్ట్‌ అంటూ చాలామంది డైరెక్టర్స్‌ కితాబు ఇచ్చిన ఈ సినిమా నాకు నచ్చలేదు అంటున్నారు ‘అవతార్‌’ సృష్టికర్త జేమ్స్‌ కెమరూన్‌. ‘స్పేస్‌ ఒడిసీ’ ఎందుకు నచ్చలేదో కెమరూన్‌ వివరిస్తూ ‘‘2001 ఏ స్పేస్‌ ఒడిసీ’ సినిమా అంటే ఎప్పటికీ ఎనలేని ప్రేమ. కానీ ప్రస్తుతానికి ఆ సినిమాని లైక్‌ చేయలేకపోతున్నాను.

కుబ్రిక్స్‌ తీసిన ఈ మాస్టర్‌పీస్‌ నా మీద ఎనలేని ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. ఆర్ట్‌ వర్క్‌ ఫామ్‌లో ఆ సినిమా మీద గౌరవం ఉంది. కానీ సినిమాలో ఎమోషనల్‌ కనెక్ట్‌ లోపించింది. ఇన్వాల్వ్‌ అవ్వలేకపోయాను. కానీ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ పరంగా ఈ సినిమా అంటే నాకు చాలా అభిమానం’’ అని ఆయన పేర్కొన్నారు. నచ్చింది అంటూనే నచ్చలేదూ అంటున్న కెమరూన్‌ ధోరణి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలా అనిపిస్తుందంటున్నారు హాలీవుడ్‌ సినీప్రియులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement