అఖిల్ నెక్ట్స్ ఎవరితో..?

Sukumar to direct Akhil Akkineni in his next - Sakshi

అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో అఖిల్, తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఎలర్ట్ అయిన అక్కినేని ఫ్యామిలీ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కింగ్ నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు. విక్రమ్ కె కుమార్ దర‍్శకత‍్వంలో తెరకెక్కిన అఖిల్ రెండో సినిమా హలోకు మంచి టాక్ రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది.

తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ త్వరలో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. అఖిల్ తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీను లేదా సుకుమార్‌ల దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో ఒకరికి అఖిల్ ఓకె చెప్తాడా..? లేక మరో దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా..? చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top