అమ్మ కానున్న జెనీలియా | Riteish Deshmukh, Genelia D'Souza expecting their first child | Sakshi
Sakshi News home page

అమ్మ కానున్న జెనీలియా

Jun 7 2014 11:10 PM | Updated on Sep 2 2017 8:27 AM

అమ్మ కానున్న జెనీలియా

అమ్మ కానున్న జెనీలియా

అంతేనా... వీలైతే నాలుగు మాటలు. కుదిరితే కప్పు కాఫీ’... అని ఎనిమిదేళ్ల క్రితం తెరపై జెనిలియా చేసిన అల్లరి అంతా ఇంతానా! తర్వాత తను ఎన్ని సినిమాల్లో నటించినా...

 ‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు. కుదిరితే కప్పు కాఫీ’... అని ఎనిమిదేళ్ల క్రితం తెరపై జెనిలియా చేసిన అల్లరి అంతా ఇంతానా! తర్వాత తను ఎన్ని సినిమాల్లో నటించినా... తెలుగువారి గుండెల్లో మాత్రం ఆమె హాసినీనే. అలాంటి హాసిని త్వరలో అమ్మ కాబోతోంది. రితేష్ దేశముఖ్‌ని రెండేళ్ల క్రితం పెళ్లాడిన ఈ అందాల భామ... అప్పుడే పిల్లలొద్దని కొన్నాళ్ల క్రితం తన భర్తతో గొడవ కూడా పెట్టుకుందని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. వాటిని జెన్నీ కూడా ఖండించలేదు. అయితే ప్రస్తుతం మాత్రం అత్తారింటి అభిమతాన్ని గౌరవిస్తూ... ‘అమ్మ’ అవ్వడానికి సిద్ధమైపోయారు జెనీలియా. అంటే త్వరలో అందాల హాసిని పొత్తిళ్లలో ఓ చిన్నారిని చూడబోతున్నామన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement