నాగార్జునను విసిగిస్తున్నాడట! | Nagarjuna Tweet About Nani On Devadas | Sakshi
Sakshi News home page

Sep 23 2018 1:14 PM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna Tweet About Nani On Devadas - Sakshi

టాలీవుడ్‌లో మల్టిస్టారర్‌ హవా కొనసాగుతోంది. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవదాస్‌’ విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 

నాని, నాగార్జునలు ఈ చిత్రాన్ని సోషల్‌​ మీడియాలో ప్రమోట్‌ చేసేపనిలో ఉన్నారు. నాగార్జున దాసు గురించి చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ట్వీట్‌తో పాటు వీడియోను పోస్ట్‌ చేస్తూ.. పక్కన అందమైన అమ్మాయి ఉన్నా.. ఎప్పుడూ ఫోన్‌ చూస్తూనే ఉంటాడు అంటూ నాని గురించి చెప్పాడు. తనకు చిరాకు తెప్పించే స్నేహితుడు దాసు అని.. మరి మీకు చిరాకు తెప్పించే స్నేహితుడు ఎవరో ట్యాగ్‌ చేయండి అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement