డేటింగ్ అనేది విదేశీ సంప్రదాయం అయినా మెల్లి మెల్లిగా ఇక్కడివాళ్లు కూడా అలవాటుపడుతున్నారు.
‘‘డేటింగ్ అనేది విదేశీ సంప్రదాయం అయినా మెల్లి మెల్లిగా ఇక్కడివాళ్లు కూడా అలవాటుపడుతున్నారు. డేటింగ్ చేయడం నాకూ ఇష్టమే’’ అని ఇలియానా అంటున్నారు. ఎవరితో డేటింగ్ చేయడం ఇష్టం అని అడిగితే నవ్వేసి ఊరుకున్నారు. కానీ, డేటింగ్ ఎలా ఉంటే బాగుంటుందో ఈ బ్యూటీ చెబుతూ - ‘‘డేటింగ్ ప్లాన్ చేసుకున్న తర్వాత ముందు మంచి పిక్నిక్ బాస్కెట్ కొనుక్కోవాలి. రుచికరమైన తినుబండారాలతో ఆ బాస్కెట్‌ని నింపుకోవాలి.
ఏ చోటు బాగుందనిపిస్తే, అక్కడ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ఓ మంచి దుప్పటి తీసుకెళ్లాలి. అది కూడా మంచి మంచి బొమ్మలున్న దుప్పటినే ఎన్నుకోవాలి. అలాగే, చల్లని ప్రదేశాలకే వెళ్లాలి. అక్కడ చలిమంట కాచుకునే సౌకర్యం ఉండాలి. ఈ మూడూ లేకపోతే డేటింగ్ వేస్ట్. డేటింగ్‌కి బీచ్‌కన్నా బెస్ట్ ప్లేస్ ఉండదు. ఇసుకలో పడుకుని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటుంటే.. భలే మజాగా ఉంటుంది. అలాగే, వైన్ కూడా ఉండాలి సుమా. వైన్ సిప్ చేస్తూ, మాటలు పంచుకుంటే మనసులు ఇంకా దగ్గరవుతాయి’’ అన్నారు.