
హేమంత్
హేమంత్, సురేంద్ర, అంజలి, లీజా హీరో హీరోయిన్లుగా వి. భానుమురళి దర్శకత్వంలో ఎమ్. చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘గాడీ నెం–143’. ‘ది ట్రావెల్ ఫర్ టైమ్‌పాస్ లవ్ అండ్ ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘భానుమురళి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాతో నిర్మాతగా మారాను.
ఈస్ట్ గోదావరి, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపి మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేశాం. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఒక సిన్సియర్ లవ్‌లోకి టైమ్‌పాస్ లవ్ ప్రవేశించి ఎలాంటి సంఘర్షణ రేపింది? అనేది చిత్రకథాంశం. క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంటుంది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ఉగాది సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్, టీజర్‌లను డిజిటల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాం’’ అన్నారు వి. భాను మురళి. ఈ సినిమాకు త్రినాథ్ మంతెన సంగీతం అందించారు.