లేచారంటే  అల్లరే  అల్లరి!

Devadas first look: Nani and Nagarjuna are sloshed - Sakshi

పేషెంట్స్‌కు మందులు రాయాల్సిన డాక్టర్‌ డాన్‌తో కలిసి మందు కొట్టాడు. సెటిల్‌మెంట్స్‌తో బిజీగా ఉండాల్సిన డాన్‌ ఏమో డాక్టర్‌తో కలిసి మందు కొట్టాడు. ఇంతకీ ఈ డాక్టర్, డాన్‌ల కహానీ ఏంటి? అంటే.. కేరాఫ్‌ శాంతాభాయ్‌ మెమోరియల్‌ చారిటీ హాస్పిటల్‌ అంటున్నారు. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’. ఇందులో ఆకాంక్షా సింగ్, రష్మిక మండన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. ధర్మరాజు సమర్పణలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. డాన్‌ దేవ్‌ పాత్రలో నాగార్జున, డాక్టర్‌ దాస్‌ పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘‘టైటిల్‌ ప్రకారం నా పక్కన పారు ఉండాలి.

కానీ ఈ దాసుగాడు ఉన్నాడు’’ అన్నారు నాగార్జున. ‘‘1996లో నాగార్జునగారి ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా విడుదలైనప్పుడు నాగ్‌ సార్‌ స్క్రీన్‌పై ఉన్నారు. నేనేమో టిక్కెట్స్‌ కోసం థియేటర్స్‌ ముందు ఉన్న క్యూలో ఉన్నా. ఇప్పుడు ఇద్దరం కలిసి ‘దేవదాస్‌’ ఫస్ట్‌ లుక్‌లో ఉన్నాం’’ అన్నారు నాని. ‘‘క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. సెప్టెంబర్‌ 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు అశ్వనీదత్‌. ‘‘ఇంకా దిగి ఉండదు వీళ్లకి. ఒక్కసారి లేచారంటే అల్లరే అల్లరి’’ అన్నారు చిత్రబృందం. నరేష్, ‘బాహుబలి’ ప్రభాకర్, రావు రమేశ్, ‘వెన్నెల’ కిశోర్, అవసరాల శ్రీనివాస్, సత్య తదితరులు నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top