వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌

Wikileaks Co-founder Julian Assange Arrested - Sakshi

వికీలీక్స్ వ్యవస్థాపకుడు  జూలియన్ పాల్ అసాంజేని అరెస్ట్‌ చేసినట్టు యూకే పోలీసులు ప్రకటించారు. తన లీక్స్‌తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన అసాంజే ఎట్టకేలకు  బ్రిటన్‌ పోలీసులకు చిక్కాడు.  ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న ఏడేళ్ల తరువాత అతనిని లండన్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. త్వరలోనే  వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 
 
మరోవైపు అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ఇటీవల ట్వీట్‌ చేసి సంచలనం రేపింది. ఈక్వేడార్ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల నుంచి తమకు ఈ సమాచారం అందినట్లు వికీలీక్స్ తెలిపింది. ఐఎన్‌ఏ పేపర్స్ లీక్ చేసి ఆఫ్షోర్ కుంభకోణం బయటపెట్టాడన్న కారణంతో ఈక్వేడార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అసాంజే అరెస్ట్‌పై స్పందించిన వికీలీక్స్‌ బ్రిటిష్‌ పోలీసులను ఆహ్వానించి మరీ ఆయన అదుపులోకి తీసుకున్నారని ట్వీట్‌ చేసింది. 

కాగా లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అరెస్టునుంచి తప్పించుకునేందుకు,స్వీడన్‌కు అప్పగించకుండా ఉండేందుకు 2012 నుంచి అసాంజే లండన్‌లోని ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top