ఆ ఒక్క ఇంజెక్షన్‌ చాలు

One injection is enough

రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన తాజా పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్‌ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని ఈ కొత్త పరిశోధన. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మెసోబ్లాస్ట్‌ అనే ఓ ఫార్మా  కంపెనీ ఉంది.

ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్‌ సీఈవో సిలివూ ఇటెస్కూ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top