
భారత్ వార్నింగ్ పనిచేసింది.. తగ్గిన పాక్
భారత్ హెచ్చరికలు ఫలించాయి. కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ కాస్తంత వెనక్కి తగ్గింది. జాదవ్‌ను వెంటనే ఉరితీయబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది.
ఇస్లామాబాద్: భారత్ హెచ్చరికలు ఫలించాయి. కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ కాస్తంత వెనక్కి తగ్గింది. జాదవ్‌ను వెంటనే ఉరితీయబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. అప్పీల్ చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇస్తామని తెలిపింది. పాక్ ఆర్మీ చీఫ్‌కు, అధ్యక్షుడికి క్షమాభిక్ష వినతిని ఇవ్వొచ్చని కూడా పాక్ తెలిపింది. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
దీంతో పాక్-భారత్ మధ్య మరోసారి తీవ్ర విభేదాలు తలెత్తాయి. పాక్ జాదవ్‌ను ఉరి తీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్ తీవ్రంగా హెచ్చరించింది. తీవ్ర చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో తాము యుద్ధానికైనా సిద్ధమేనన్నట్లుగా వ్యాఖ్యానించిన పాక్ తాజాగా మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పీల్ చేసుకునేందుకు రెండు నెలల గడువు ఇస్తామని చెప్పింది.