ఇండోనేషియాలో సునామీ

Earthquake In Indonesia Attack Tsunami - Sakshi

జకార్తా : దీవుల దేశం ఇండోనేషియా మరోసారి భూకంపంతో వణికిపోయింది. శుక్రవారం సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళలకు గురైయ్యారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదవ్వడంతో ప్రజలు ఇళ్లలోంచి భయటకు పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు ముందుగా హెచ్చరించినట్లుగానే తీర ప్రాంతంలో సునామీ అలలు ఎగసిపడ్డాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఎగసిపడడంతో ప్రజలు ఉరుకులుపరుగులు తీశారు. సునామీ దాటికి తీర ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

పెద్ద విపత్తు సంభంవించే అవకాశం ఉన్నందున అధికారులంతా సిద్దంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఎంతా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. కాగా గతనెల ఇండోనేషియాలోని లాంబోక్‌ దీవిలో సంభవించిన భూకంపంలో 500కి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top