డ్రైవింగ్‌లో ఫోన్‌ ముట్టుకుంటే ఫైన్‌!

Drivers to Get Fines if They Even Touch Phones in Britain - Sakshi

న్యూఢిల్లీ : రోడ్లపై డ్రైవ్‌ చేస్తూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడటాన్ని దాదాపు అన్ని దేశాలు నిషేధించిన విషయం తెల్సిందే. అయినప్పటికీ అంతటా కొందరు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారు. బ్రిటన్‌లో భారీ ఫైన్లు, కఠిన శిక్షలు ఉన్నప్పటికీ అక్కడి కూడా మొబైల్‌ ఫోన్ల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. ఫోన్లే మాట్లాడినట్లు సీసీ టీవీ కెమేరాలకు ఒకటి, రెండు సార్లు ఫైన్లు, అంతకన్నా ఎక్కువ దొరికితే లైసెన్స్‌ రద్దు లాంటి శిక్షలు విధించినా ఎందుకు నేరాలు తగ్గడం లేదనే కోణంలో పరిశీలించగా బ్రిటన్‌ మోటారు వాహన చట్టంలో లోపం ఉన్నట్లు తేలింది.

ఇంతవరకు ఫోన్లో మాట్లాడితేనే శిక్షలు విధిస్తూ వస్తున్నారు. మొబైల్‌ ఫోన్లో ఫోటోలు చూసినా, తీసినా, మిస్సెజ్‌లు చదివినా, మ్యూజిక్‌ ఆప్‌లు సర్చ్‌ చేసినా శిక్షలు లేవు. మొబైల్లో ఫోన్లో ఇలాంటి చేయడం వల్లనే ప్రమాదాలు తగ్గడం లేదని నిపుణులు సూచించడంతో బ్రిటన్‌ ఈ రోజు నుంచి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. వాహనాన్ని నడుపుతూ ఏ కారణంతోనైనా మొబైల్‌ ముట్టుకుంటే చాలు 200 పౌండ్ల (18.500 రూపాయలు) వరకు ఫైన్‌. ఆరు పాయింట్ల విధింపు. 35 పాయింట్ల లోపున్న యువకుల్లో 17 నుంచి 25 శాతం వరకు డ్రైవర్లు మిస్సేజ్‌లు చూడడమో, సోషల్‌ మీడియాలు చెక్‌ చేసుకోవడమో చేస్తున్నారు. ఫోన్‌ మాట్లాడితే అద్దాల గుండా కనిపిస్తోంది. ఫోన్‌ను ముట్టుకుంటే ఎలా తెలియాలి! అందుకని అన్ని వీధుల్లో హెచ్డీ సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలని బ్రిటన్‌ అధికారులు నిర్ణయించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top