ఆ యువకుడి చెవిలో 26 బొద్దింకలు | 26 Cockroaches Found Inside Man Ear | Sakshi
Sakshi News home page

ఆ యువకుడి చెవిలో 26 బొద్దింకలు

Oct 2 2019 9:42 AM | Updated on Oct 2 2019 1:48 PM

26 Cockroaches Found Inside Man Ear - Sakshi

మెల్‌బోర్న్‌: చెవిలో విపరీతమైన దురద, నెప్పి రావడంతో ఓ యువకుడు వైద్యుల ను సంప్రదించాడు. వైద్యపరీక్షల అనంతరం అతడి చెవిలో 26 బొద్దింకలున్నాయని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. లీ(19)కి ఒక రోజు రాత్రి కుడి చెవిలో భరించలేని దురద వచ్చింది. వెంటనే వేలు పెట్టి చూడగా విపరీతమైన నొప్పి మొదలైంది. దీంతో వైద్యులను సంప్రదించాడు. వైద్యపరీక్షల అనంతరం వారు అతడి చెవిలో 26 బొద్దింక పిల్లలున్నాయని గుర్తించారు. లీ చెవి మార్గంలో ఎన్నో వారాలుగా బొద్దింక నివసించి గుడ్లు పెట్టిందని, అందుకే అతడి చెవి దగ్గర చర్మం పాడైందని వివరించారు. అతడు సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చాడని లేకపోతే చెవి పూర్తిగా దెబ్బతినేదని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement