చైనా సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ | talangana government MOU with china company | Sakshi
Sakshi News home page

చైనా సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ

Apr 15 2016 7:36 PM | Updated on Oct 9 2018 4:06 PM

ప్రముఖ చైనా ఏలక్ట్రానిక్స్ తయరీ సంస్ద కేడీఎక్స్(KDX)తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూని కుదుర్చుకుంది.

► ప్రముఖ చైనా  ఏలక్ట్రానిక్స్ తయరీ సంస్ద కేడీఎక్స్(KDX)తో తెలంగాణ ప్రభుత్వం ఎమ్ఓయూ
► ఐటి శాఖ మంత్రి కెటి రామరావుతో సమావేశమైన సంస్ధ ప్రతినిధులు
► నగరంలో పెట్టుబడులకు ఓప్పందం
► అద్దాలు అవసరంలేని త్రిడి తెరలు, మెబైల్ పోన్లు, టివీల తయారీకి అవకాశం
► సంస్ధకు పూర్తి సహకారాలుంటాయన్న మంత్రి
► సంస్ద తయారు చేసిన త్రీడి తెరతో కూడిన మెబైల్ బహూకరించిన కేడీఎక్స్


హైదరాబాద్: ప్రముఖ చైనా  ఏలక్ట్రానిక్స్ తయరీ సంస్ద కేడీఎక్స్(KDX)తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శుక్రవారం బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసంలో ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంతో కేడీఎక్స్ సంస్ధ ఈ ఎంఓయూను కుదుర్చుకుంది. చైనా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ ఏలక్రానిక్స్ సంస్థ.. ప్రపంచంలో కళ్లద్దాలు లేకుండా త్రీడి చిత్రాన్ని చూడగలిగే తెరలను తయారుచేసే ఏకైక సంస్ధ అనీ, ఈ సంస్ధ ఇప్పటికే ఇలాంటి సదుపాయం కలిగిన మెబైల్ ఫోన్ ని తయారు చేసిందని కేడీఎక్స్ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు.

దీంతో పాటు మెబైల్ పోన్లు, ట్యాబ్లెట్ల తయారీ రంగంలోనూ కేడీఎక్స్ ప్రముఖ సంస్ధగా ఉన్నదని, తమ సంస్ధ ఫిలిప్స్, డాల్బీ 3డి  వంటి ప్రముఖ సంస్ధలతోనూ కలిసి పని చేస్తుందని మంత్రికి తెలియజేశారు. వినోద పరిశ్రమ అవసరాల కోసం వాడే  ఫిల్మ్ తయారీలో కేడీఎక్స్ రెండో స్దానంలో ఉన్నట్లు మంత్రికి తెలిపారు. గత ఏడాది తమ సంస్ధ 1.2 బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించిందని, గ్రూప్  విస్తరణలో భాగంగా తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు వారు తెలిపారు. మంత్రితో సమావేశానంతనరం సంస్ధ ప్రతినిధులు నగరంలో అందుబాటులో ఉన్న మౌళిక సదుపాయాలను పరిశీలించారు.

కేడీఎక్స్తోపాటు ఎంఓయూలో భాగస్వామి అయిన ఎరీస్ ఎపికా గ్రూప్కు 15 దేశాల్లో 45 కంపెనీలున్నాయని ఎంఓయూ తెలిపింది. కేడీఎక్స్-ఎరీస్ ఎపికా జాయింట్ గ్రూప్ భాగసామ్య సంస్ధ తెలంగాణలో అందుబాటులో ఉన్న నిపుణులు, ఐటి పరిశ్రమ, ముఖ్యంగా కనెక్టీవీటి సౌకర్యాల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకి ఏంచుకున్నట్లు తెలిపింది. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటి పార్కులు, ఐటి సెజ్లు సైతం తమ భవిష్యత్తు పెట్టుబడులకి ఊతం ఇస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.  తెలంగాణలో అద్దాలులేని 3డి తెరలు, మెబైల్ పోన్లు, టివిలు వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను తయారు చేయనున్నట్లు కేడీఎక్స్-ఎరీస్ ఎపికా  సంస్ధ ఎంవోయూలో పెర్కోంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ బాగసామ్యం ద్వారా పూర్తి సహయ సహకారాలందించేందుకు సిద్దమని తెలిపింది. ఏలక్ట్రానిక్స్, గేమింగ్ కంటెట్, మెబైల్ తయారీ రంగాల్లోని ప్రముఖ సంస్ధతో ఎంఓయూ కుదుర్చుకోవడం పట్ల మంత్రి కె.తారక రామరావు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన, పారిశ్రామిక విధానం వలన అనేక అంతర్జాతీయ స్ధాయి కంపెనీలు నగరానికి వస్తున్నాయని, ఇదే వరుసలో కేడీఎక్స్ తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నదని మంత్రి తెలిపారు. కేడీఎక్స్ పెట్టుబడులకి హైదరాబాద్ సరైన గమ్య స్ధానమన్న మంత్రి, కంపెనీ సేవలకి కావాల్సిన సదుపాయాలు, గేమింగ్ మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం ప్రత్యేక మెబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ మెబైల్ మ్యానిఫాక్చరింగ్ పాలసీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఇక వినోద పరిశ్రమ కోసం గేమింగ్ సిటీ నిర్మాణం తర్వలో ప్రారంభం కాబోతున్నదని, దేశంలోనే రెండో అతి పెద్ద సినిమా పరిశ్రమ తెలుగుదేనని మంత్రి కేడీఎక్స్ ప్రతినిదులకి తెలిపారు. ప్రంపచంలోనే మెదటిసారి త్రిడి తెరతో మెబైల్ తయారు చేస్తున్నామన్న కేడీఎక్స్ సంస్ధ ప్రతినిధులు మంత్రికి తమ మెబైల్ ఫోన్ (ఇంకా మార్కెట్ లోకి విడుదల కాలేదు) బహుకరించారు. అందులో ఉన్న త్రీడీ వీడియోలను ఏలాంటి కళ్లద్దాలు లేకుండానే చూవచ్చని మంత్రి తెలిపారు.

కేడీఎక్స్ సంస్ధ రూపొందిచిన మెబైల్ని వీక్షించిన కేటీఆర్.. వారి ప్రొడక్ట్ విజయవంతం అవుతుందని, ఇలాంటి వినూత్న రంగాల్లో పెట్టుబడులు పెట్టే కేడీఎక్స్ సంస్ధకి తమ పూర్తి సహయ సహకారాలుంటాని హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహ రెడ్డి, ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement