రాష్ట్ర రాజధాని నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కాబోతోంది.
85 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్న ఈ సదస్సును రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి తదితరులు హాజరు కానున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం వెల్లడించారు.