
సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మహిళా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలసి వినతి పత్రం అందజేశాయి.
చిత్ర పరిశ్రమలోని కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తింప చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. స్పందించిన మంత్రి.. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని, సమస్యలపై చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో పీవోడబ్లు్య నాయకురాలు సంధ్య, సామాజికవేత్త సుజన, న్యాయవాది సుజన, భూమిక, ఆశ, రజియా, కళావతి, సృజన, సుమిత్ర, ఝాన్సీ తదితరులు ఉన్నారు.