కారును ఢీకొన్న లారీ | Larry car collision | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ

Mar 11 2014 1:58 AM | Updated on Sep 2 2017 4:33 AM

కారును ఢీకొన్న లారీ

కారును ఢీకొన్న లారీ

రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ లారీ రాజీవ్ రహదారిపై కారును ఢీకొంది.

 శామీర్‌పేట్,  రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ లారీ రాజీవ్ రహదారిపై  కారును ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులతో పాటు ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని అలియాబాద్ చౌరాస్తా సమీపంలోని రాజీవ్ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్, లలితలు దంపతులు. వీరికి కుమారుడు నితిన్ (5 నెలలు) ఉన్నాడు. సోమవారం దంపతులు లలిత పుట్టిల్లు సిద్దిపేట్ నుంచి కారులో నగరానికి రాజీవ్ రహదారి మీదుగా వస్తున్నారు. ఈక్రమంలో మండలంలోని అలియాబాద్ చౌరాస్తా సమీపంలోని పాత టోల్ గేటు వద్దకు రాగానే రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొంది.

ప్రమాదంలో ప్రవీణ్‌తో పాటు భార్య లలిత, చిన్నారి నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని అల్వాల్‌లోని ఆక్సిజన్ ఆస్పత్రికి తరలించారు. లారీని స్థానికులు పట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement