ఏపీ ప్రభుత్వం ఎర్రచందనాన్ని విక్రయించేందుకు నిర్వహించిన వేలంలో చోటు చేసుకున్న అక్రమాలను అడ్డుకోవా లని
ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఎర్రచందనాన్ని విక్రయించేందుకు నిర్వహించిన వేలంలో చోటు చేసుకున్న అక్రమాలను అడ్డుకోవా లని దాఖలైన వాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఎర్రచం దనం వేలాన్ని ఎవరి పేరు మీద ఖరారు చేశారు.. వేలంలో ఎన్ని బిడ్లు దాఖలయ్యాయి? ఎన్ని బిడ్లను తిరస్కరించారు.. తదితర వివరాలను సమర్పించాలంటూ మంగళవా రం ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–వేలంలో తక్కువ ధరలు కోట్ చేసిన వారికే ఎర్ర చందనం విక్రయిం చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోం దని, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న ఈ చర్యలను అడ్డుకుని ఎర్రచందనం ఎగుమతులను ఆపాల ని గుంటూరుకు చెందిన డి.బసవ శంకర్‌రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళ వారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.