ఈ నెల 10వ తేదీ నుండి సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు
హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీ నుండి సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. రైతుల సాయంతోనే దళారి వ్యవస్థను అడ్డుకోగలమని ఆయన అన్నారు. పత్తి అమ్మిన వారం లోపే రైతు ఖాతాలో డబ్బులు పడేలా అధికారులను సూచించారు.
అమీర్పేట సెస్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన పత్తి రైతుల సదస్సుకు కేంద్ర జౌళి శాక మంత్రి సంతోష్ గంగ్వార్, దత్తాత్రేయలు హాజరయ్యారు. మద్దతు ధర ఇంకా తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేయటంతో... మద్దతు ధరపై మరోసారి ప్రధానితో కలిసి చర్చిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.