‘టార్జాన్’’ సినిమాల్లో చూస్తుంటాం... పాష్‌గా, జోష్‌గా ఉండే పట్టణ ప్రాంత అమ్మాయి...అమాయకంగా, మొరటుగా కనిపించే టార్జన్ ప్రేమలో పడుతుంది. ‘సినిమాలో సాధ్యం కానిదేముంది’ అని వెక్కిరింపుగా అనుకుంటాంగానీ...నిజజీవితంలో కూడా అలాంటివి జరుగుతుంటాయి అని చెప్పడానికి అందమైన యువతి శారా బేగం గురించి మనం తప్పక చెప్పుకోవాలి. ఇంచుమించుగా టార్జాన్ సినిమా కథల్లా ఉండే నిజజీవితంలోని ఓ ఆసక్తికరమైన కథ ఇది...
బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ శారా బేగంకు తొమ్మిదేళ్ల వయసు నుంచి ఒక కోరిక ఉండేది... అమెజాన్ అడవుల్లో ఉండే ఆదివాసులను చూడాలని. ఆ కోరిక తనతో పాటు పెరిగి పెద్దయిపోయింది. ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో లండన్‌లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని హురోని తెగ ప్రజల జీవనశైలి గురించి అధ్యయనం చేయడానికి ఈక్వేడర్ అడవుల్లోకి వెళ్లింది శారా. ఆ అడవిలో హురోని తెగకు చెందిన వాళ్లు మూడు వేల వరకు ఉంటారు. వారు శారాకు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడికి వెళ్లిన తరువాత... బయటి వ్యక్తిగా శారా ఎప్పుడూ ప్రవర్తించలేదు. వాళ్లలో భాగమైపోయింది. అల్లికల నుంచి వేట వరకు అన్నీ నేర్చుకుంది. ఈలోపు కథలో చిన్న ట్విస్ట్....
ఉన్నట్టుండి ఒకరోజు తెగ పెద్దలు శారాను ఒక గుడిసెలోకి పిలిచి వివస్త్రగా మార్చివేసి తమ సంప్రదాయ దుస్తులను ధరింప చేశారు. తమ సంప్రదాయానికి సంబంధించిన మంత్రాలు చదవడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో శారాకు అర్థం కాలేదు. ‘‘నువ్వు మాకు రాణిలాంటిదానివి. మా తెగ యోధుడు జింక్టోతో నీకు వివాహం జరిపిస్తున్నాం. లైంగిక అవసరాల కోసం నిన్ను వాడుకోవడానికి ఇలా చేయడం లేదు. మా తెగ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారిని, ఇష్టమైన అమ్మాయిలను ఇలా గౌరవిస్తాం’’ అన్నారు పెద్దలు. వారి అమాయకత్వానికి ఆశ్చర్యపడిందో, ముచ్చటపడిందో, తనకు తాను రాజీ పడిందో తెలియదుగానీ... జింక్టోతో జరిగిన తన పెళ్లి తంతును ఆమె ప్రతిఘటించలేదు. విశేషం ఏమిటంటే, జింక్టో కూడా తనకు బాగా నచ్చాడు. ‘‘జింక్టో బలశాలి, నేర్పరి అయిన వేటగాడు మాత్రమే కాదు... మంచి హృదయం ఉన్నవాడు’’ అని జింక్టో గురించి మెచ్చుకోలుగా మాట్లాడింది శారా. రెండు వారాలు తరువాత తిరిగి లండన్‌కు చేరుకుంది శారా. ఈ రెండు వారాల్లోనే హురోని తెగల ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకుంది. వారి మనసులో చోటు సంపాదించకుంది.
లండన్‌కు వచ్చిన తరువాత తన అడవి అనుభవాలను ‘అమెజాన్ సోల్స్’ పేరుతో డాక్యుమెంటరీగా నిర్మించింది. ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రశంసలు అందుకొంది. ఆమె సాహసాన్ని అందరూ కొనియాడారు. శారా అడవికి దూరమై పోవచ్చుగానీ, ఆమె హృదయంలో హురోని తెగ ప్రజలు ఉన్నారు. వారి గురించి కబుర్లను ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో ఆసక్తికరంగా రాస్తూనే ఉంది శారా బేగం. ‘‘వెనక్కి వెళ్లి అందరినీ చూసి రావాలని ఉంది’’ అని కూడా ఆమె అంటోంది.
అలా... ఆ అడవిలో ఆమె పెళ్లయిపోయింది!
Published Tue, Dec 16 2014 11:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement