పీడకలలు రాకుండా ఉండాలంటే...

How to avoid bad dreams - Sakshi

ఎలాంటి ఆర్థిక సమస్యలూ, ఆరోగ్య సమస్యలూ లేకున్నా,  ఒక్కోసారి ఏ అర్ధరాత్రి వేళలోనో గాఢనిద్రలో వచ్చే పీడకలలకు ఉలిక్కిపడి హఠాత్తుగా మేలుకుంటారు. ఇక ఆ తర్వాత నిద్రపట్టడమే గగనమవుతుంది. పీడకలలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే...
మీకు అనుకూల నక్షత్రం చూసుకుని, ఏదైనా మంగళవారం రోజున మొదలుపెట్టి హనుమాన్‌ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించండి. ప్రతిరోజూ నిత్య పూజలో భాగంగా ఈ పఠనం సాగించండి.
మహామృత్యుంజయ యంత్రాన్ని తాయెత్తులో భద్రపరచి, దానిని ఏదైనా శనివారం రోజున నల్లదారంతో మెడలో ధరించండి.
ఉదయం, సాయంత్రం ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి. ప్రతిరోజూ నిత్యపూజలో భాగంగా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించండి.
పీడకలలకు పెద్దలే ఉలిక్కిపడతారు. పిల్లలకు ఇలాంటి అనుభవం ఎదురైతే మరింతగా భయాందోళనలు చెందుతారు. అలాంటప్పుడు పిల్లల తల వద్ద చిన్న పటిక ముక్కను ఉంచి వారిని నిద్రపుచ్చండి. వారు నిద్రలోకి జారుకుంటుండగా ఆంజనేయ దండకాన్ని పఠించండి.
పిల్లలు పీడకలలో ఇబ్బంది పడుతుంటే, ఏదైనా మంగళవారం రోజున ఆంజనేయుడి ఆలయంలో అర్చన జరిపించండి. సంజీవని పర్వతం మోస్తున్నట్లుగా ఉండే ఆంజనేయుని వెండి లాకెట్‌ను పిల్లల మెడలో వేయండి.

– పన్యాల జగ న్నాథదాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top