కేసు వాదిస్తుండగా న్యాయవాదిపై దాడి | victim attack on lawyer in the court | Sakshi
Sakshi News home page

కేసు వాదిస్తుండగా న్యాయవాదిపై దాడి

Aug 10 2016 6:43 PM | Updated on Sep 4 2017 8:34 AM

న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్‌ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా  ఎర్రమంజిల్‌ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది.

కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది వసంత్‌రావు దేశ్‌పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. కోర్టు సిబ్బంది, స్థానికులు వారించినా వినకపోవడంతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement