మండలంలోని చించోలి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రానుబాయి(26) డయేరియాతో మంగళవారం రాత్రి మతిచెందింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రానుబాయి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విరేచనాలతో అస్వస్థతకు గురైంది.
డయేరియాతో గిరిజన మహిళ మృతి
Jul 19 2016 10:14 PM | Updated on Sep 4 2017 5:19 AM
ఇచ్చోడ : మండలంలోని చించోలి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రానుబాయి(26) డయేరియాతో మంగళవారం రాత్రి మతిచెందింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రానుబాయి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విరేచనాలతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను 11 గంటల ప్రాంతంలో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ వైద్యం అందించారు. సాయంత్రం వరకు బాగానే ఉన్న ఆమె కు తిరిగి 6 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు తీవ్రంగా బాధపడింది. దీంతో డాక్టర్ సర్పరాజ్ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే 108 అంబులెన్స్ వచ్చేలోపే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రానుబాయి మతి చెందింది. కాగా, డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రానుబాయి మహిళ మతిచెందినట్లు బంధువులు ఆరోపించారు. డాక్టర్ సర్పరాజ్‌ను వివరణ కోరగా.. తము సరైన వైద్యం అందించామని తెలిపారు.
Advertisement
Advertisement