మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
మిర్యాలగూడ అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ భాద్యత అని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కృష్ణహరి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు.
మిర్యాలగూడ అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ భాద్యత అని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కృష్ణహరి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఓఎం స్కీం కింద బస్టాండ్‌లో రూ. 6లక్షలతో నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో 11 బస్టాండ్లలో మరుగుదొడ్ల అవసరాన్ని గుర్తించామని మిర్యాలగూడ, సూర్యాపేట, ఆలేరు, దేవరకొండలో ఇప్పటికే పూర్తయినట్లు పేర్కొన్నారు. నార్కట్‌పల్లి, భువనగిరి బస్టాండ్లలో నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 17 మినీ బస్సులను నడిపించాలని నిర్ణయించామని, అందులో డ్రైవర్ కం కండక్టర్‌గా ఒక్కరే ఉంటారని తెలిపారు. కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసీకి రూ.4.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించారు. అనంతరం అవరణలో పూల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుధాకర్‌రావు, సీఐ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.