‘చెక్క’నైనా కళాఖండాలు | srinivas great artist | Sakshi
Sakshi News home page

‘చెక్క’నైనా కళాఖండాలు

Jul 30 2016 11:17 PM | Updated on Sep 4 2017 7:04 AM

‘చెక్క’నైనా కళాఖండాలు

‘చెక్క’నైనా కళాఖండాలు

ఎటువంటి గ్రాఫిక్స్‌ లేకుండానే ఆయన 3డీ చిత్రాలను సష్టిస్తారు. చెక్క దొరికితే అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దుతారు. ప్రముఖుల చిత్రాలను చూసి జీవం ఉట్టిపడే కళాకతులను రూపొందిస్తారు.

అనకాపల్లి : ఎటువంటి గ్రాఫిక్స్‌ లేకుండానే ఆయన 3డీ చిత్రాలను సష్టిస్తారు. చెక్క దొరికితే అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దుతారు. ప్రముఖుల చిత్రాలను చూసి జీవం ఉట్టిపడే కళాకతులను రూపొందిస్తారు. కార్వింగ్‌ వత్తిని అవలీల ఆకలింపు చేసుకున్నారు అనకాపల్లికి చెందిన వలివరెడ్డి శ్రీనివాస్‌. వ్యర్థ పదార్థాలుగా భావించే ఐస్‌క్రీం పుల్లలు, చెట్టు వేళ్లు, చెట్టు మొదళ్లు, తినేసి పారేసే మొక్కజొన్న పొత్తులు, సుద్ద ముక్కలు, బియ్యం గింజపై సూక్ష్మకతిలో బొమ్మలు ఇలా దేనితోౖ¯ð నా కళాఖండాన్ని తీర్చి దిద్దగల సమర్థుడు శ్రీనివాస్‌. 1995 నుంచి కార్వింగ్‌ వత్తిని ప్రారంభించిన శ్రీనివాస్‌కు ఎనిమిది అవార్డులు వచ్చాయి. తాజాగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.
బర్మాలో పుట్టి...
బర్మాలో పుట్టిన వలివరెడ్డి శ్రీనివాస్‌ సొంత ఊరు బుచ్చియ్యపేట మండలం దిబ్బిడి. స్వాతంత్య్ర సమర యోధుడు వలివరెడ్డి లక్ష్మణరావు, మునమ్మ దంపతుల కుమారుడైన శ్రీనివాస్‌ జీవనోపాధి కోసం అనకాపల్లి పట్టణానికి 1973లో వచ్చారు. ముందుగా టైలరింగ్‌ వత్తిని ప్రారంభించారు. అదే సమయంలో వాచ్‌ మెకానిక్‌గానూ పనిచేసేవారు. కాలక్రమేణా ఆయన సెల్‌ మెకానిక్‌గా స్థిరపడ్డారు. 
కార్వింగ్‌ కళాకారునిగా గుర్తింపు...
ఎటువంటి వ్యర్థాలైన ఆయనకు కనిపిస్తే మదిలో ఆయనకు ఒక ఆలోచన మొదలవుతుంది. ఆరు గంటల వ్యవధిలో ఎటువంటి కళాఖండాన్నయినా తీర్చి దిద్దగల సమర్థులు. ఇప్పటి వరకూ ఆయన 900కు పైగా కళాఖండాలను రూపొందించారు. ఈయన రూపొందించిన కళాఖండాలలో నరేంద్ర మోది, ఒబామా కరచాలనం చేసుకోవడం, నరేంద్రమోది తన తల్లికి భగవద్గీత ఇస్తున్న కళాఖండం, వాజ్‌పేయి అద్వానీ కలిసి సంభాషిస్తున్నట్లు, మన్మోహన్‌సింగ్‌ సోనియా గాంధీ చర్చిస్తున్నట్లు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా పద్మభూషణ్‌ తీసుకున్నట్లు, మదర్‌ థెరిసా, యేసుక్రీస్తు, అల్లు రామలింగయ్య, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, గాంధీ నెహ్రూలు సంభాషిస్తున్నట్లు, అంబానీ కుటుంబీకులు, మహేష్‌బాబు, అమితాబ్‌ ఇలా ప్రముఖుల బొమ్మలు జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
అవార్డుల సొంతం...
ఇప్పటి వరకూ శ్రీనివాస్‌కు 8 అవార్డులు దక్కాయి. సంఘమిత్ర, సుజనపుత్ర, మార్వ్‌లెస్‌ గిన్నిస్‌ రికార్డు, హై రేంజ్‌ ఆఫ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, మిరాకిల్, విశాఖ ఉత్సవాల్లోనూ అవార్డులు పొందిన శ్రీనివాస్‌ ఇటీవల లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు.
గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదిస్తా
వత్తిగా మెకానిజం...ప్రవత్తిగా కార్వింగ్‌ కళ నాకు రెండూ కళ్లే. ఇప్పటి వరకూ ఎందరో ప్రముఖుల వద్ద ప్రశంసలు పొందాను. ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నాను. గిన్నిస్‌ బుక్‌లో స్థానం పొందాలనేది నా వాంఛ. కార్వింగ్‌ కళాకారుల్ని తీర్చిదిద్దాలనేది నా అభిలాష.
–శ్రీనివాస్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement