దసరా నుంచే నూతన మండలాల పరిపాలన | new mandal ruling for dasara | Sakshi
Sakshi News home page

దసరా నుంచే నూతన మండలాల పరిపాలన

Sep 9 2016 11:39 PM | Updated on Jul 29 2019 6:03 PM

దసరా నుంచే నూతన మండలాల పరిపాలన - Sakshi

దసరా నుంచే నూతన మండలాల పరిపాలన

హాలియా : వచ్చే దసరా నుంచే నూతన మండలాల పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావ్‌ అన్నారు.

హాలియా : వచ్చే దసరా నుంచే నూతన మండలాల పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావ్‌ అన్నారు. శుక్రవారం తిర్మలగిరిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల విభజనలో భాగంగా తిర్మలగిరి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. కొత్త మండలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ వేణుమాధవరావు, కార్యదర్శులు నాగిరెడ్డి, సత్యనారాయణ, స్థానిక సర్పంచ్‌ పిడిగం నాగయ్య ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement