ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది.
విశాఖపట్నం : ఉత్తరబంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. లక్షాద్వీప్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాన, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.