రుణమాఫీ నిధులను ఒకేసారి విడుదల చేయాలి
రాంనగర్ : 3వ, 4వ విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు.
రాంనగర్ : 3వ, 4వ విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి మూడో విడత డబ్బులు నేటì కీ విడుదల చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నా రుణమాఫీపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సాగర్ ఎడమకాల్వ, ఏఎమ్మార్పీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపి పంటలకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ శ్రీశైలం, జహంగీర్, దండ వెంకటరెడ్డి, మందడి రాంరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, కావలి కృష్ణ, మందడి నర్సింహ, ఇంద్రారెడ్డి ఉన్నారు.