జర్నలిస్టుల ధర్నా | journalist Protest in nidamanur | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల ధర్నా

Aug 17 2016 12:04 AM | Updated on Sep 4 2017 9:31 AM

జర్నలిస్టుల ధర్నా

జర్నలిస్టుల ధర్నా

నిడమనూరు : పుష్కర ఘాట్‌ల వద్ద పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం సాగర్‌ పైలాన్‌ కాలనీలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు.

నిడమనూరు : పుష్కర  ఘాట్‌ల వద్ద పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం సాగర్‌ పైలాన్‌ కాలనీలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన పీఆర్వో వాహనాన్ని అడ్డగించారనే కారణంతో పోలీసులు ప్రదర్శించిన తీరుకు ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు రోడ్డుపై బైటాయించారు. అర్ధగంటసేపు ఆందోళన చేయడంతో పోలీస్‌పరేడ్‌గ్రౌండ్స్‌ వద్ద అటు, ఇటు వామనాలు నిలిచిపోయాయి. డీఎస్పీ, సీఐలు పరుగున వచ్చి ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. విలేకరులను చిన్న చూపు చూస్తున్నారని, మంత్రి చెప్పిన నిమిషాల వ్యవధిలోనే ఇలా జరుగడం దారుణమన్నారు. వారికి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఆందోళనలో ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement