కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్‌ | hussain saheb as kurnool rdo | Sakshi
Sakshi News home page

కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్‌

Published Mon, Feb 6 2017 10:52 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

hussain saheb as kurnool rdo

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్‌డీఓ)గా హుసేన్‌ సాహెబ్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమెహన్‌ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. 40 రోజుల క్రితం హంద్రీనీవా యూనిట్‌–4 ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునను ఆర్‌డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన ఆర్‌డీఓగా బాధ్యతలు చేపట్టకుండా దేశం నేతలు అడ్డంకులు సృష్టించారు.
 
ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే అభిప్రాయంతో ఆయన విధులు చేపట్టకుండా అడ్డుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందువల్ల కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యనారాయణను పూర్తి అదనపు బాధ్యతలతో కర్నూలు ఆర్‌డీఓగా నియమించారు. అయితే ఆయన అనారోగ్య కారణలతో విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఎంఎల్‌సీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా రావడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న హుసేన్‌సాహెబ్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో ఆర్‌డీఓగా కలెక్టర్‌ నియమించారు. ఈ మేరకు ఆయన వెంటనే విధుల్లో చేరారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement