నాయుడుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాయుడుపేట ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండతీవ్రంగా ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
నాయుడుపేటలో భారీ వర్షం
Jul 27 2016 12:11 AM | Updated on Oct 1 2018 2:11 PM
	నాయుడుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాయుడుపేట ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండతీవ్రంగా ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రధానంగా తిమ్మాజీకండ్రిగ, చిగురుపాడు, మేనకూరు, కోనేటిరాజుపాళెం, భీమవరం, యర్రప్పశెట్టికండ్రిగలో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో పొలాల్లో నీళ్లు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చివరితడికి నీరందక బోర్లు నుంచి వచ్చే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్న నేప«థ్యంలో భారీ వర్షం వరిపంటకు ఊపిరి పోసిందని సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు యర్రప్పశెట్టికండ్రిగ, మేనకూరు తదితర గ్రామాల వీధుల్లో నీరు నిలిచి చిత్తడి చిత్తడిగా మారాయి.  
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
