కుటుంబకలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త.
తాడేపల్లి(గుంటూరు): కుటుంబకలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మర్రేడి ఏసుబాబు, జయలక్ష్మి(33) దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, ఏసుబాబుకు భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కత్తితో నరికి చంపాడు. ఒక కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లగా పక్కనే మంచంపై నిద్రిస్తున్న మరో కూతురును అరవకుండా నోరు మూశాడు.
తీవ్ర రక్తస్రావం కావటంతో జయలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. గురువారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన సీఐ సురేష్‌బాబు సంఘటన స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యపై అనుమానంతోనే ఏసుబాబు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.