జాతీయ రహదారికి ‘కోత’ గండం!
వరంగల్ – భూపాలపట్నం 163వ నంబర్ జాతీయ రహదారి, దానిపైనున్న వంతెనలు కోతకు గురవుతున్నాయి. దీంతో ముల్లకట్ట బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా తయారైంది. ఈ వంతెనకు ఇరువైపులా రివిట్‌మెంట్ చేయకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. రహదారి నిర్మాణ సమయంలో దశలవారీగా కాకుండా మట్టిని ఎత్తుగా పోసి ఒకేసారి రోలింగ్ చేశారు. ఫలితంగా భారీ వర్షాలకు రోడ్డు ఇరువైపులా కోతకు గురవుతోంది.
-
భారీ వరదలు వస్తే బ్రిడ్జికి ప్రమాదమే
-
రివిట్‌మెంట్ చేయకపోవడమే కారణం
-
పట్టించుకోని ఉన్నతాధికారులు
వరంగల్/ఏటూరునాగారం : వరంగల్ – భూపాలపట్నం 163వ నంబర్ జాతీయ రహదారి, దానిపైనున్న వంతెనలు కోతకు గురవుతున్నాయి. దీంతో ముల్లకట్ట బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా తయారైంది. ఈ వంతెనకు ఇరువైపులా రివిట్‌మెంట్ చేయకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. రహదారి నిర్మాణ సమయంలో దశలవారీగా కాకుండా మట్టిని ఎత్తుగా పోసి ఒకేసారి రోలింగ్ చేశారు. ఫలితంగా భారీ వర్షాలకు రోడ్డు ఇరువైపులా కోతకు గురవుతోంది. దీని కారణంగా ఈ మార్గంలోని కల్వర్టు, మూల మలుపులు, బ్రిడ్జిల వద్ద నిర్మించిన రెయిలింగ్‌లు కూలిపోయే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.వందల కోట్లు వెచ్చించి, నిర్మించిన ఎన్‌హెచ్ 163 రహదారికి రివిట్‌మెంట్ పనులు కాకపోవడం గండంగా పరిణమిస్తోంది.
డీపీఆర్‌లో ప్రస్తావించకపోవడంతో..
రహదారి నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీ రివిట్‌మెంట్ నిధులను మంజూరు చేయించుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణ పనుల డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించిన సమయంలో.. అందులో రివిట్‌మెంట్ పనుల గురించి ప్రస్తావించలేదని సమాచారం. అందువల్లే దానికి సంబంధించిన పనులు జరగలేదని పేర్కొం టున్నారు. దీనిపై ఎన్‌హెచ్ జేఈఈ ప్రదీప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా..‘ రివిట్‌మెంట్ పనుల కోసం నిధులు కేటాయించాలని ఎన్‌హెచ్ అ«ధికారులను కోరాం. అయితే దీని ప్రతిపాదనలు ఢిల్లీ స్థాయలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మూడేళ్ల పాటు జాతీయ రహదారి, బ్రిడ్జి కోతకు గురైతే మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌కు ఉంటుం ది. వానలు తగ్గిన వెంటనే రోడ్డుకు ఇరువైపులా రివిట్‌మెంట్ చేయిస్తాం. రివిట్‌మెంట్‌కు సంబంధించిన రాయి ఈ ప్రాంతంలో లభించడం లేదు. దీంతో కాంక్రీట్ స్లా»Œ వేయాలని భావిస్తున్నాం’ అని వివరించారు.