చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు (నంబర్ 17652) ఆలస్యంగా నడుస్తోంది.
కర్నూలు(రాజ్‌విహార్): చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు (నంబర్ 17652) ఆలస్యంగా నడుస్తోంది. వర్దా తుపాన్ నేపథ్యంలో రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం నిర్వాహణ పనుల కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలస్యంగా నడుస్తోంది. కాచిగూడలో సాయంత్రం 4:30గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు అర్ధరాత్రి 12:30 బయలుదేరి కర్నూలుకు ప్రతి రోజు రాత్రి తెల్లవారుజామున 4:30 గంటలకు వచ్చి వెళ్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.