పర్యాటక, సంస్కృతి, వారసత్వ బోర్డును ఏర్పాటు చేస్తూ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, అమరావతి : పర్యాటక, సంస్కృతి, వారసత్వ బోర్డును ఏర్పాటు చేస్తూ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు చైర్మన్‌గా ఉండే ఈ బోర్డుకు పర్యాటక, సంస్కృతి, వారసత్వ శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు.
అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టూరిజం, కల్చర్ ఇన్‌చార్జి కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, ఆర్థిక శాఖ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్రే‍్టషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌లకు చెందిన శాఖ కార్యదర్శులు, టూరిజం అథారిటీ సీఈఓ, కేంద్ర ప్రభుత్వ టూరిజం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, టూర్ ఆపరేటర్స్ ఇండియన్ అసోసియేషన్ చైర్మన్, ఏపీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సూచించిన ఒక వ్యక్తి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అధ్యక్షుడు బోర్డులో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు సాహసం క్రీడల అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, భారతీయ పరిశ్రమల సమ్మేళనం సూచించిన వ్యక్తి ఒకరు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.