అమెరికాలో గుంటూరు జిల్లా వాసి హత్య | Guntur district's man murder in the United States | Sakshi
Sakshi News home page

అమెరికాలో గుంటూరు జిల్లా వాసి హత్య

Apr 7 2015 10:46 PM | Updated on Jul 30 2018 8:29 PM

మాదల రాజేష్‌బాబు (ఫైల్ ఫొటో) - Sakshi

మాదల రాజేష్‌బాబు (ఫైల్ ఫొటో)

గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిని అమెరికాలో హత్య చేశారు.

తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన మాదల రాజేష్‌బాబు(36)ను అమెరికాలోని చికాగోలో కొందరు దుండగులు హత్య చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు హత్యకు జరిగినట్లు బంధువులు తెలిపారు. గ్రామానికి చెందిన మాదల ఆనందరావు, వెంకాయమ్మ దంపతులకు పుట్టిన రాజేష్‌బాబు ప్రాధమిక విద్య వరకు మండలంలోనే పూర్తిచేశారు. పదేళ్ళు హైదరాబాదులో ఉన్నత చదువులు చదివారు. అనంతరం అమెరికాలోని చికాగోలో ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. నల్లజాతీయులు డబ్బుకోసం బెదిరించటంతో నిరాకరించగా హత్య చేసినట్లు సమాచారం.

ఈయనకు నరసారావుపేటకు సమీపంలోని వడ్లమానివారిపాలేనికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. వారికి ఒక పాప. రాజేష్ మృతి వార్త వినగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి హైదరాబాదులోనే నివాసం ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. మృతి వార్త వినగానే రాజేష్ పెదనాన్న మాదల వెంకట్రావు,  బాల్య స్నేహితుడు గూడూరు పవన్‌కుమార్ కన్నీళ్ళ పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement