టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ : ఉద్యోగానికి ముప్పు

TikTok videos of nurses in Odisha hospital goviral  - Sakshi

నర్సుల టిక్‌ టాక్‌ వీడియో​ వైరల్‌

సాక్షి, భువనేశ్వర్‌ : సోషల్‌ మీడియాలో వేలం వెర్రిగా మారిన టిక్‌ టాక్‌ వీడియోలకు సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా  ఒడిశాలోని  ఒక ఆసుపత్రిలోని నర్సుల టిక్‌టాక్‌ వీడియో ఒకటి  వైరల్‌ అయింది. 

మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో నవజాత శిశువుల వార్డులో పనిచేసే కొంతమంది నర్సులు ఈ వీడియోను  తీశారు. నర్సింగ్‌ డ్రెస్‌లో  బాలీవుడ్‌ పాటలకు పదం కదుపుతూ ఫన్నీ డైలాగ్‌ల పెదాలు కలుపుతూ ముచ్చట తీర్చుకున్నారు. కానీ అదే వారికి ఉద్యోగాలకు ముప్పు తేనుంది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ముఖ్య  వైద్య అధికారి (సిడిఎంఓ) ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే సదరు నర్సులకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నామని  ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ తపన్‌ కుమార్‌  వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top