గుట్కా కేంద్రాలపై దాడులు

Task Force Officers Attack On Gutka Centers Warangal - Sakshi

వరంగల్‌ క్రైం: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అమ్ముతున్న కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆదివారం దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం...సుబేదారి పోలీసు స్టేషన్‌ పరిధిలోని  గోకుల్‌నగర్‌కు చెందిన కొమురవెల్లి  వేణుమాధవ్‌ హుజురాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌  గుట్కా సరఫరా దారుని నుంచి  గుట్కాలు తీసుకుని అమ్ముతున్నాడు.ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నాం.. సరఫరా దారుడు పరారీలో ఉన్నాడు.  నిందితుల నుంచి రూ.72వేల విలువ గల   గుట్కాలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  తదుపరి చర్యల కోసం నింధితులను సుబేదారి ఎస్సై సత్యనారాయణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు.

ప్రైవేట్‌ హాస్టల్‌లో గుట్కాలు స్వాధీనం
హన్మకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా గుట్కాలు సరఫరా చేస్తున్న వీరమల్ల కార్తీక్‌ను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వీరమల్ల కార్తీక్‌ హన్మకొండలోని కిషన్‌పురలో మహర్షి ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ నగరంలోని పాన్‌షాపులకు గుట్కాలను సరఫరా చేస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కార్తీక్‌ గత కొంత కాలంగా గుట్కాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నింధితున్ని అదుపులోకి తీసుకుని నిందితుని నుంచి రూ.50వేల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.  తదుపరి చర్యల కోసం నిందితున్ని హన్మకొండ ఎస్సై శ్రీనా«ధ్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top